Credits: Twitter

Vijayawada, March 20: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో (Nagarjuna University) డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ (RGV) చేసిన కామెంట్లు (Comments) రేపిన దుమారం ఇంకా కొనసాగుతున్నది. విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జీవీపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (VH) కూడా మండిపడటం తెలిసిందే. అయితే వీహెచ్ వ్యాఖ్యలను ఆర్జీవీ  సెటైరికల్ గా తిప్పికొట్టారు. ‘‘ఓ తాతగారూ మీరింకా ఉన్నారా??? నాసా యాక్ట్ వర్తించదు టాడా యాక్ట్‌ ని 1995 లోనే తీసేశారు... ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి... ఒకసారి డాక్టర్‌కి చూపించుకోండి’’ అని ట్విట్టర్ లో ఆర్జీవీ ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఓ వెబ్ సైట్ లో వచ్చిన వీహెచ్ వ్యాఖ్యల కథనాన్ని కూడా వర్మ పంచుకున్నారు.

MLC Kavitha ED Row: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేడే.. ఇప్పటికే ఢిల్లీకి కేసీఆర్ కుమార్తె.. ఈడీ విచారణ హాజరుపై సస్పెన్స్

అసలేం జరిగింది?

ఇటీవల నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ.. ‘‘తినండి.. తాగండి.... ’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళితే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చని, బతికున్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలని సూచించారు. నచ్చిన విధంగా బతకాలని, హార్డ్‌ వర్క్‌ చేయకుండా, స్మార్ట్‌ గా పని చేస్తూ ఉపాధ్యాయుల మాటలు పట్టించుకోకుండా ఇష్టానుసారం జీవించాలని ఉచిత సలహాలు ఇచ్చారు.

Nirav Modi: గడ్డు పరిస్థితుల్లో నీరవ్ మోడీ? కంపెనీ ఖాతాలో కేవలం రూ. 236

వీహెచ్ ఆగ్రహం

ఆర్జీవీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో  ఆర్జీవీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం జగన్‌కు వీహెచ్ లేఖ రాశారు. మహిళలను ఉద్దేశించి ఆర్జీవీ చేసిన కామెంట్లు సరికాదని మండిపడ్డారు. ఇప్పటివరకు ఆర్జీవీ కామెంట్లపై సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరూ స్పందించలేదని... ఇలాగే వదిలేస్తే మహిళలను అవమానించడం అలవాటవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్మకు దమ్ముంటే ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని సవాల్ విసిరారు. నాగార్జున వర్సిటీ వీసీని సస్పెండ్‌ చేసి, ఆర్జీవీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తనపై విమర్శలు చేసిన వి.హనుమంతరావుపై ఆర్జీవీ సెటైరికల్ గా స్పందించారు.

‘Millet Man’ PV Sathish Passes Away: ‘మిల్లెట్ మ్యాన్’ పీవీ సతీశ్ కుమార్ కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సతీశ్.. చిరుధాన్యాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సతీశ్