Kalvakuntla Kavitha | File Image

Newdelhi, March 20: ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) మలిదఫా ఈడీ (ED) విచారణ నేడే జరుగనున్నది. ఈ క్రమంలోనే ఆమె ఢిల్లీ చేరుకున్నారు. కవిత వెంట మంత్రి కేటిఆర్, ఎంపీ సంతోష్ కూడా వెళ్లారు. అయితే ఈడీ విచారణకు కవిత హాజరుపై సస్పెన్స్ నెలకొంది. ఈడీ విచారణకు హాజరుకావాలా? లేదా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సూచించడంతో కవిత ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారాలపై ఇప్పటికే అరెస్ట్ అయిన అరుణ్ పిళ్లైతో కలిపి విచారించేందుకు మార్చి 16న కవితకు మూడోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్‌పై మార్చి 24న విచారణ జరగనుందని, అప్పటివరకు ఆగాలని ఈడీకి కవిత లేఖ రాశారు.

Nirav Modi: గడ్డు పరిస్థితుల్లో నీరవ్ మోడీ? కంపెనీ ఖాతాలో కేవలం రూ. 236

దీంతో కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా కవిత పిటిషన్‌పై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని సుప్రీంకోర్టును ఈడీ కోరింది. దీంతో ఇవాళ కవిత హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 16న ఈడీ విచారణకు కవిత హాజరుకావాల్సి ఉండగా.. ఆమె హాజరుకాలేదు. తన తరపున లాయర్‌ను ఈడీ కార్యాలయానికి పంపించారు. దీంతో 20వ తేదీన విచారణకు రావాలని ఈడీ మరోసారి నోటీసులిచ్చింది. సోమవారం 11 గంటలకు ఈడీ ముందు కవిత అటెండ్ కావాల్సి ఉంది. ఈ రోజు కవిత ఈడీ ముందు విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చూడాలి.

‘Millet Man’ PV Sathish Passes Away: ‘మిల్లెట్ మ్యాన్’ పీవీ సతీశ్ కుమార్ కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సతీశ్.. చిరుధాన్యాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సతీశ్