![](https://test1.latestly.com/wp-content/uploads/2023/03/Vennira-Aadai-Nirmala-1.jpg)
1960 - 70 దశకంలో అందాల కథానాయికగా వెన్నిరాడై నిర్మల (Vennira Aadai Nirmala) చిత్రసీమలో ఒక వెలుగు వెలిగారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఆమె 100 కి పైగా సినిమాల్లో నటించారు. చాలా కాలం తరువాత ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో అయితే ఆమె అడపా దడపా మాత్రమే తెరపై కనిపిస్తున్నారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన టఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ గురించి అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
ఆమె ఇంటర్యూలో మాట్లాడుతూ.. రామానాయుడు గారు అప్పట్లో నన్ను లక్కీ హీరోయిన్ గా భావించేవారు. ఆయన నిర్మించిన 'పాప కోసం' సినిమా సూపర్ హిట్ అయింది. అందువల్లనే ఆయన 'కలిసుందాం రా' సినిమాకి కూడా నన్ను గుర్తుపెట్టుకుని పిలిపించి వేషం ఇచ్చారు.ఇక ఎస్వీ రాంగారావుగారితోను కలిసి నటించాను .. ఆయన రాజసమే వేరు. నేను యాక్ట్ చేసిన హీరోల్లో శోభన్ బాబుగారు చాలా డీసెంట్. ఆయనంటే చాలా ఇష్టమన్నారు.
అప్పట్లో షూటింగు పూర్తయిన తరువాత ఒక హీరో తాగేసి నా రూమ్ కి వచ్చాడు. తలుపు తీయమని గొడవచేశాడు. నేను తలుపు తీయకపోవడంతో ఆ రాత్రంతా అరుస్తూ తలుపు కొడుతూనే ఉన్నాడు. ఆ మరునాడు ఉదయం ఆ సినిమా చేయనని చెప్పేసి వచ్చాను. అలాగే నాకు మర్యాద ఇవ్వడం లేదని గ్రహించిన మరుక్షణమే నేను షూటింగు నుంచి తప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి'' అని చెప్పుకొచ్చారు.