Hyd, July 31: ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇకపై గద్దర్ అవార్డుల పేరిట ప్రభుత్వం తర్వాత అవార్డులు ఇస్తామని ప్రకటించారు.

దీనిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఇండస్ట్రీ ప్రముఖులను కోరారు. అయితే దీనిపై టాలీవుడ్ పెద్దలు ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించిన‌ట్లుగా చెప్పారు. అయితే సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరమ‌ని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. గద్దర్ అవార్డ్స్ కి తను సపోర్ట్ గా గతంలో తాను మాట్లాడిన వీడియోని చిరంజీవి షేర్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత తెలుగు పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని తెలిపారు.

తమిళ రైటర్, ఉద్యమకారుడు అయిన శివశంకరికి విశ్వంభర డాక్టర్ సి నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్రదానోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్ షోల కోసం ప్రభుత్వం దగ్గరకు వచ్చే హీరోలతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ యాడ్ చేయించాలని రేవంత్ సూచించిన సంగతి తెలిసిందే. ఒక్క మెగాస్టార్ చిరంజీవి తప్ప మిగితా హీరోలు స్పందించిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారగా దీనిపై ఇప్పటికైన ఇండస్ట్రీ ప్రముఖులు స్పందించి ముందుకు వస్తారో వేచిచూడాలి. డార్లింగ్ ప్రభాస్ మేనియా మాములుగా లేదుగా.. యూట్యూబ్‌లో నంబర్‌వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతున్న ది రాజాసాబ్‌ గ్లింప్స్‌, వీడియో ఇదిగో.

Here's Tweet:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి