తెలుగు సినిమా నటుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కుటుంబ సభ్యులు కరోనా (Jeevitha Rajasekhar Family Covid 19) మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనతో పాటు భార్య జీవిత, పిల్లలు శివానీ, శివాత్మికలకు కరోనా సోకిన విషయం నిజమేనని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ‘పిల్లలిద్దరూ పూర్తిగా కోలుకున్నారని.. జీవిత, తాను మాత్రం ఇంకా వైద్యుల సంరక్షణలోనే ఉన్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం మా ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే ఇంటికి వెళ్తామంటూ’ ట్వీట్ చేశారు.
హిందీ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్‌లో శివానీ నటిస్తుండగా, విష్ణు విశాల్ హీరోగా వెంకటేశ్ దర్శకత్వంలోనూ కథానాయికగా ఛాన్స్ కొట్టేశారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా శివానీ పరిచయం కానుంది. ఇక నూతన దర్శకుడు దుర్గానరేశ్ గుట్ట డైరెక్షన్‌లో ‘విధివిలాసం’ సినిమాలో శివాత్మిక నటిస్తుంది. ఈ సినిమాలో అరుణ్ అదిత్ జోడిగా ఆమె కనిపించనున్నారు.
Here's Actor Dr.Rajasekhar Tweet
The news is true that Jeevitha, Kids and I have tested positive for corona and are currently being treated in the hospital.
Both the kids are completely out of it, Jeevitha and I are feeling much better and will be back home soon!
Thank you !
— Dr.Rajasekhar (@ActorRajasekhar) October 17, 2020
రాజశేఖర్ (Tollywood Actor Rajasekhar) చివరిసారిగా 2019 యాక్షన్ థ్రిల్లర్ కల్కిలో కనిపించాడు. దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. రాహుల్ రామకృష్ణ, అదా శర్మ, నందిత శ్వేత మరియు పుజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే రాజశేఖర్ త్వరలోనే కొన్ని ప్రాజెక్టులపై సంతకం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. జీవిత సినిమాలకు దూరంగా ఉంది మరియు ఆమె MAA లో యాక్టివ్ సభ్యురాలు. వారి కుమార్తెలు శివానీ, శివత్మిక ఇద్దరూ టాలీవుడ్‌లో నటీమణులుగా తమ అదృష్టాన్ని పరీక్షిస్తున్నారు.