Tollywood Celebrities Group Reach Gannavaram Airport meet to Ap CM YS Jagan (Photo-Twitter)

Amaravati, June 9: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో టాలీవుడ్ (Tollywood) సిని పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి సినీ ప్రముఖుల బృందం రెడీ అవుతున్న సంగతి విదితమే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ షూటాంగ్ లకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో (AP CM YS Jagan) భేటీ నేపథ్యంలో సినీ ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతి, ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్, ధియేటర్లు ప్రారంభించడానికి అనుమతి నిరాకరించిన తెలంగాణ సర్కారు

చిరంజీవి, నాగార్జున, సి.కల్యాణ్, త్రివిక్రమ్ రాజమౌళి, డి.సురేష్ బాబు, దిల్‌రాజు, వెంకట్రామి రెడ్డి, దామోదర్‌ ప్రసాద్‌ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రిని కలవనుంది.

Here's Video

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు అనుమతితో పాటు థియేటర్ల ఓపెన్‌, తదితర అంశాల గురించి కూడా సీఎం వైఎస్‌ జగన్‌తో వారు చర్చించే అవకాశం ఉంది.