Director P Chandrasekhar Reddy Dies (Photo-Video Grab)

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నై లో మృతి (Director P Chandrasekhar Reddy Dies) చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. యన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలను ఆయన దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు.. ఎక్కువగా దర్శకత్వం వహించారు. పీసీ రెడ్డి మృతికి (Director PC Reddy dies) టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు.

నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం పేటలో 1933 అక్టోబర్ 14న జన్మించారు. ఈయన పూర్తి పేరు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి. 1971లో కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందిన ‘అనూరాధ’ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు. ‘అత్తలూ-కోడళ్ళు’, ‘విచిత్ర దాంపత్యం’, ‘ఇల్లు-ఇల్లాలు’, ‘బడిపంతులు’, ‘తాండవ కృష్ణుడు’, ‘మానవుడు-దానవుడు’, ‘నాయుడుబావ’, ‘మానవుడు-మహనీయుడు’, ‘పుట్టింటి గౌరవం’, ‘ఒకే రక్తం’, ‘రాముడు-రంగడు’, ‘జగ్గు’, కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో “అత్తలు- కోడళ్ళు, అనూరాధ, ఇల్లు-ఇల్లాలు, తల్లీకొడుకులు, మమత, స్నేహబంధం, గౌరి, పెద్దలు మారాలి, కొత్తకాపురం, సౌభాగ్యవతి, పాడిపంటలు, జన్మజన్మల బంధం, పట్నవాసం, ముత్తయిదువ, భోగభాగ్యాలు, పగబట్టిన సింహం, బంగారుభూమి, పులిజూదం, నా పిలుపే ప్రభంజనం, ముద్దుబిడ్డ” చిత్రాలు తెరకెక్కించారు.

మరో విషాదం, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత, క్యాన్సర్‌తో పోరాడుతూ తుది శ్వాస విడిచిన మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కైతప్రమ్‌ విశ్వనాథన్‌

సూపర్ స్టార్ కృష్ణ తో 20 చిత్రాలు తెరకెక్కించడం విశేషం. పి.సి.రెడ్డి. ఆయన వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య, పి.యన్.రామచంద్రరావు, శరత్, వై. నాగేశ్వరరావు వంటివారు దర్శకులుగా రాణించారు.