సీరియల్ షూటింగ్ సెట్‌లో హీరో అతి దూకుడు టెక్నీషియన్స్ చేత తన్నులు తినేలా చేయించింది. బుల్లితెర హీరో, నటుడుపై సిబ్బంది చేయి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వైరల్ వీడియో వివరాల్లోకెళితే.. స్టార్ మా ధారావాహిక సీరియల్ సావిత్రమ్మ గారి అబ్బాయితో తెలుగులో గుర్తింపు పొందిన నటుడు చందన్ కుమార్ పై టెక్నీషియన్స్ చేయి చేసుకున్నారు. అతని చెంప పగలగొట్టారు.
శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ షూటింగ్ లో భాగంగా చందన్..మూవీ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. సీరియల్‌కు పనిచేస్తున్న ఓ టెక్నిషియన్‌ను నానాబూతులు తిడుతూ నోరుపారేసుకున్నాడు. దీంతో యూనిట్ అంతా తిరగబడ్డారు. ఈ క్రమంలోనే తన మదర్‌ను దూషించాడంటూ ఓ టెక్నిషియన్ చందన్ చెంప చెల్లుమనిపించాడు.
అంతేకాదు అతనిపై మాటల దాడికి దిగారు. ఇక అక్కడే ఉన్న మిగతా సిబ్బంది చందన్‌తో చేత టెక్నిషియన్‌కు క్షమాపణలు చెప్పించారు. అనకూడని మాటలు అన్నాడు, నా తల్లిని దూషించాడు ఇప్పుడు సారీ చెబితే ఊరుకుంటామా అని సదరు సిబ్బంది వాదించాడు.
ఇలా నటుడు చందన్ ఓవరాక్షన్ చేసి చెంప దెబ్బతిన్న వీడియో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా చందన్ కన్నడ పరిశ్రమలో ఎంతోకాలంగా యాక్టివ్‌గా ఉన్నాడు. చందన్ హీరోగా, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా ప్రేమ బరహా చిత్రం కూడా వచ్చింది. ‘రాధా కళ్యాణ’, ‘లక్ష్మీ బారమ్మ’ వంటి కన్నడ సీరియల్స్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు.