Vijay Deverakonda boosts Hyderabad City police (photo-Twitter)

Hyderabad, April 14: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ప్రాణాలకు తెగించి తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) పోలీస్ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చ‌టించారు.

తెలంగాణలో 592కు చేరిన కోవిడ్ 9 కేసులు

హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ లో సోమ‌వారం సాయంత్రం ఈ కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ (Police Commissioner Anjani Kumar) ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌మ విధుల‌ను నిర్వ‌ర్తిస్తూ నిజ‌మైన హీరోలుగా నిలుస్తున్న పోలీసుల అధికారుల‌ను, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప‌ల‌క‌రించారు.

నిరంత‌రం ప‌నిచేస్తూ అల‌స‌ట పొందుతున్న పోలీస్ సిబ్బందికి విజ‌య్ ప‌ల‌క‌రింపులు, మాటలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ప్ర‌తి రోజూ సాయంత్రం పోలీస్ క‌మిష‌న‌రేట్ లో జ‌రిగే వీడియో కాన్ఫ‌రెన్స్ లో విజ‌య్ పాల్గొన‌డంతో పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ ఇత‌ర సిబ్బందిలో కొత్త ఉత్సాహాం క‌న‌ప‌డింది.

Here's HYD CP Tweet

ఈ సంద‌ర్భంగా పోలీస్ లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ వారిని ఉత్సాహ ప‌రుస్తూ స‌మాధానాలు చెప్పారు. పోలీసుల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి విజయ్‌తో పాటు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

Here's Hyderabad City Police Tweet

చాలా మంది పోలీస్ అధికారులు విజ‌య్ కి థాంక్స్‌ చెబుతూ త‌మ ఆనందాన్ని పంచుకున్నారు. పోలీసులలో ఉత్సహాన్ని నింపేందుకు సమయం ఇచ్చిన విజయ్ దేవరకొండ కు పోలీస్ కమిషనర్ అంజని కుమార్ తో పాటు ఆయన సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు విజ‌య్ వారిని ఉత్సాహ ప‌రుస్తూ స‌మాధానాలు ఇచ్చారు.

పోలీసుల ప్రశ్నలు- విజయ్ దేవరకొండ జవాబులు

పోలీస్ : మీరు డిప్రెష‌న్ లో ఉంటే ఏం చేస్తారు?

విజయ్ : నా ప‌నే నాకు గుర్తింపు నిచ్చింది. మీ అంద‌రి ప్రేమ‌నిచ్చింది. నాకు ఫెయిల్యూర్స్ వ‌చ్చినా ఎప్పుడైనా బాధ క‌లిగినా నా ప‌ని మీద మ‌రింత ఫోక‌స్ చేస్తాను. నేను చిన్న‌ప్పుడు స్కూల్లో మ‌హాభార‌తం నాటకంలో పాత్ర వేశాను. అప్పుడు కృష్ణ భగవానుడు అన్న ఆ మాట నా మీద బాగా బ‌లంగా ప‌డింది.. ఈ స‌మ‌యం గ‌డిచిపోతుంది...నిజ‌మే ఏ స‌మ‌యం అయినా శాశ్వతం కాదు.. క‌రోనా కూడా అంతే మ‌నం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే క‌రోనా కూడా మ‌న లైఫ్ లో ఒక జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది.

పోలీస్ : లాక్ డౌన్ పీరియ‌డ్ లో మీరు మీ అమ్మ‌కు స‌హాయం చేస్తున్నారా?

విజయ్ : నేను షూటింగ్‌లలో బిజీ ఉండేట‌ప్పుడు ఇంట్లో విష‌యాలు ఏవీ వాడ్ని కాదు. కానీ ఇప్పుడు అమ్మ ప‌డుతున్న క‌ష్టం చూస్తే మాత్రం చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను అమ్మకు స‌హాయం చేయ‌డానికి వెళ్ళిన‌ప్పుడు నీవ‌ల్ల మ‌రింత ప‌ని పెరుగుతుంద‌ని అమ్మ కోప్ప‌డుతుంది. కానీ ఇలాంటి స‌మ‌యంలో డ్యూటీలు చేస్తూ ఇంటి ప‌నిని చ‌క్క బెడుతున్న మ‌హిళా అధికారుల‌కు హ్యాట్సాఫ్‌ చెబుతున్నాను .

పోలీస్ : మీరు పోలీస్ చెక్ పోస్ట్ ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను బ‌య‌టకు రావొద్ద‌ని కోరాలి

విజయ్ : త‌ప్ప‌కుండా వ‌స్తాను కానీ నేను వ‌చ్చిన‌ప్పుడు మీ లాఠీల‌కు ప‌నిచెప్ప‌కూడ‌దు అలాంటి ప‌ర్మీష‌న్ లెట‌ర్ నాకు ఇస్తే త‌ప్ప‌కుండా వ‌స్తాను. కానీ మ‌న సీఎం కేసీఆర్ సార్ చాలా క్లియ‌ర్ గా బ‌య‌ట‌కు రావొద్దు అని చెప్పారు. వాళ్లు చెప్పాక కూడా బ‌య‌ట తిరిగే వాళ్ళ‌కు మీ ప‌ద్ద‌తిలోనే స‌మాధానం చెప్పాలి. నేను వ‌చ్చి చెబితే మంచి జ‌రుగుతుంది అని మీరు న‌మ్మితే త‌ప్ప‌కుండా వ‌స్తాను.

పోలీస్ : పోలీస్ అధికారిగా మిమ్మ‌ల్ని చూడాల‌నుకుంటున్నాము

విజయ్ : త‌ప్ప‌కుండా మంచి స్క్రిప్ట్ వ‌స్తే చేస్తాను. రెండు మూడేళ్లలో మంచి పోలీస్ పాత్ర‌తో మీ ముందుకు వ‌స్తానని బదులిచ్చారు.

పోలీస్ : మీరు పోలీస్ అయి ఉంటే ఈ పరిస్థితిలో ఎలా ఫీల్ అయ్యే వారు?

విజయ్ : చాలా బాధ్య‌త‌గా ఫీల్ అయ్యే వాడిని. క‌మిష‌న‌ర్ గారి ఆదేశాల మేర‌కు ప‌నిచేసే వాడిని. మీరంద‌రూ మా కోసం ప‌నిచేస్తున్నారు. మేము ఇంట్లో కూర్చుంటే మీరు ప‌నిగంట‌లు పెంచుకొని మా కోసం రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్నారు మీ అంద‌రికీ నా న‌మ‌స్కారాలు.