Coronavirus lockdown Star MAA re-telecasts Bigg Boss TV Show (photo-Twitter)

Hyderabad, Mar 30: కరోనావైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో (India Lockdown) ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. వారు ఇంట్లోనే ఉండిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని చాలామంది సోషల్ మీడియా (Social Media) ద్వారా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారి కోసం టీవీ ఛానళ్లు పాత సీరియల్స్ ని మళ్లీ ప్రసారం చేస్తున్నాయి.

దూరదర్శన్‌లో రామాయణం, డీడీ భారతిలో మహాభారతం ఎపిసోడ్స్ ప్రసారం

ఇళ్లలో ఉన్నవారి కాలక్షేపం కోసం 30 ఏళ్ల కిందట ప్రజలను అలరించిన రామాయణం సీరియల్‌ను దూరదర్శన్‌ చానల్‌లో మరోసారి ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహాభారత్ సీరియల్ కూడా డిడి భారతి ప్రసారం చేస్తోంది. ఇదే విధంగా ‘స్టార్‌ మా’ (star maa tv) కూడా టీవీ వీక్షకులకు వినోదాన్ని పంచడానికి బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3ని (Bigg Boss Telugu 3 Re-Telecast) మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Here's STAR MAA Tweet

సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం మూడు గంటలకు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 మెమొరీస్‌ను ప్రసారం చేయనున్నట్టు స్టార్‌ మా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది. ‘21 రోజుల లాక్‌డౌన్‌ (21 days Lockdown) సమయంలో ప్రతిఒక్కరు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నట్టు అనుభూతి పొందుతున్నారు. అందుకే మరోసారి బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 మెమొరీస్‌ని చూసేద్దాం’ అని పేర్కొంది.

తెలుగు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్

కాగా, నాగార్జున హౌస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 మూడు నెలలకు పైగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇందులో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలువగా, శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు.