Sameer Hasan (Photo-Video Grab)

టాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ పాత్రలతో మెప్పించే నటీనటులకు ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ అందుతోంది. ఈ నేపధ్యంలోనే సీనియర్ మోస్ట్ నటుడు సమీర్ (Actor Sameer Hasan) కూడా అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సమీర్ (Tollywood Actor) తన కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టాడు.కెరీర్‌ ప్రారంభంలో ఓ ప్రముఖ ఛానెల్‌లో వరుస సీరియల్స్‌లో నటించిన సమీర్‌ ఆ తర్వాత అదే ఛానెల్‌ నుంచి బయటకు పంపిచేయడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ ఇష్యూపై ఆయన మాట్లాడుతూ.. నా మొగుడు నాకు సొంతం సీరియల్‌ హీరోయిన్‌తో ఎఫైర్‌ పెట్టుకున్నానని, సెట్‌లోనే రాసలీలలు అంటూ కొందరు నాపై ప్రచారం చేశారు. దీంతో సదరు యాజమాన్యం అసలు ఏం జరిగిందో కూడా కనుక్కోకుండా నన్ను అర్థాంతరంగా సీరియల్‌ నుంచి తప్పించారు. నాకు రావాల్సిన చెక్కులు కూడా ఆపేశారు. దీంతో అద్దెలు కట్టుకోలేక, ఈఐఎంలు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ తర్వాత కొన్నాళ్లకు అసలు విషయం తెలిసి ఆయనే ఫోన్‌ చేసి సారీ చెప్పారు. కానీ అప్పటికే నా మనసు విరిగిపోయింది. అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు సమీర్‌.

ఈ నెల 26 నుంచి బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్, హౌస్ మేట్స్ లిస్టు విడుదలైంది, ఎవరెవరు ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సాధారణంగా సీరియల్స్‌లో కష్టపడి ఫేమ్‌ తెచ్చుకున్నాక సినిమాల్లో నటిస్తుంటారు.అయితే నటుడు సమీర్‌ విషయంలో మాత్రం సీరియల్స్‌ నుండి ఉన్నపలంగా తొలగించడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా పలు గుర్తిండిపోయే పాత్రలు చేశాడు.