Amit Shah Chairs High-Level Meet on Maoism With CMS and Deputy CMS, Praises States’ Efforts in Fight Against Left Wing Extremism (Watch Video) (Photo Credit: X/IANS)

New Delhi, Oct 7: మావోయిస్టు తీవ్రవాదం తుదిదశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం దృష్టి పెట్టినట్లు హోం మంత్రి తెలిపారు. న‌క్స‌ల్స్ ప్ర‌భావిత రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రుల‌తో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి (Amit Shah) ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ప్ర‌త్యేకంగా మీటింగ్ నిర్వ‌హించారు. ఈ సమావేశంలో 2023, మార్చి 31వ తేదీ నాటికి దేశంలో నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్స్ అంశాలపై చర్చించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలంటూ పిలుపునిచ్చారు. దేశంలో వామ‌ప‌క్ష తీవ్ర‌వాదం చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 2026 మార్చి నాటికి దేశం ఆ స‌మ‌స్య నుంచి విముక్తి కానున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 8 రాష్ట్రాల ప్ర‌తినిధుల‌తో జ‌రిగిన రివ్యూ మీటింగ్‌లో అమిత్ షా మాట్లాడుతూ.. గ‌డిచిన 30 ఏళ్ల‌లో తొలిసారి ఇండియాలో వామ‌ప‌క్ష తీవ్రవాద హింస వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 100 క‌న్నా త‌క్కువ‌కు ప‌డిపోయింద‌న్నారు. ఇది పెద్ద అచీవ్మెంట్ అని పేర్కొన్నారు.

బీజేపీకి షాక్, జమ్మూ కశ్మీర్ - హర్యానాలో కాంగ్రెస్‌దే అధికారం, ఎగ్జిట్ పోల్స్ హస్తం పార్టీ వైపే!

ఇప్పటివరకు 13 వేల మందికి పైగా మావోయిస్టులు (Maoists) ఆయుధాలు వదిలేశారు. 2024లో 202 మంది మావోయిస్టులు మృతిచెందగా.. 723 మంది లొంగిపోయారు. భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలి. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. అక్కడ కొందరు మావోయిస్టులు లొంగిపోయారు’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

Here's Videos

మావో యుద్ధం చేస్తున్న యువ‌త త‌మ వ‌ద్ద ఉన్న ఆయుధాల‌ను స‌రెండ‌ర్ చేయాల‌ని షా అప్పీల్ చేశారు. కేంద్రం అందిస్తున్న పున‌రావాస ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధిపొందాల‌ని ఆయ‌న కోరారు. న‌క్స‌ల్స్ హిం ఎన్న‌టికీ, ఎప్ప‌టికీ ఎవ‌రికీ సాయం చేయ‌ద‌న్నారు. ప్ర‌స్తుతం 80 శాతం న‌క్స‌ల్స్ కేడ‌ర్ చ‌త్తీస్‌ఘ‌డ్‌లో మాత్ర‌మే ఉన్న‌ద‌ని, వామ‌ప‌క్ష తీవ్ర‌వాదంపై తుది స‌మ‌రం చేప‌ట్టే ద‌శ ఆస‌న్న‌మైన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

మావోయిస్టు రహితంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని షా పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ సీఎం, డీజీపీని ఆయన అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో మోదీ సర్కార్‌ చేసిన అభివృద్ధి గురించి వివరించారు. ‘‘పదేళ్లలో 11,500 కిలోమీటర్ల మేర రోడ్‌ నెట్‌వర్క్‌తో పాటు 15,300 సెల్‌ఫోన్‌ టవర్లను ఏర్పాటుచేశాం. 165 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటుచేశాం. గతంలో హింసాత్మక ఘటనలు 16,400కు పైగా జరిగాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు 7,700లకు తగ్గాయి’’ అని వెల్లడించారు.

మోదీ ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్యంగా పని చేస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే వికసిత భారత్ సాధించాలంటే గిరిజనులు, ఆదివాసీలు సైతం అందులో భాగస్వామ్యం కావాలన్నారు.కానీ ప్రభుత్వ ఫలాలు గిరిజనులు, ఆదివాసీలకు అందకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. రహదారులు, టవర్లు, చివరకు విద్య, వైద్యం సైతం వీరికి చేరనివ్వడం లేదన్నారు.

పౌరులు, భద్రతా బలగాల మరణాలు 70 శాతం తగ్గాయి. హింస ప్రభావిత జిల్లాలు 96 నుంచి 42కు తగ్గాయి. హింసాత్మక ఘటనలు నమోదయ్యే పోలీసుస్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి తగ్గింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఇది సాధ్యమైంది’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

ఈ సమీక్షా సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతోపాటు డీజీపీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే జార్ఖండ్, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.