Hyd, Oct 5: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. హర్యానాలో కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలపగా జమ్మూ కశ్మీర్ లో మాత్రం కాంగ్రెస్ - జేకేఎన్సీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాంగ్రెస్ 55,బీజేపీ 26,బీఎస్పీ 2-3,ఇతరులు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 45 శాతం ఓటు బ్యాంకు సాధించగా సీఎంగా భూపేందర్ సింగ్ హుడాకు 39 శాతం మంది ప్రజలు ఓటు వేశారు.
జమ్మూలో మొత్తం 90 స్థానాలుండగా మేజిక్ ఫిగర్ 46. అయితే జేకేఎన్సీ - కాంగ్రెస్ కూటమి కలిసి అధికారం ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. జేకేఎన్సీ - కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుండగా బీజేపీ 23-27 స్థానాలు, కేజేపీడీపీ 7-11,ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మంత్రి సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్, సమంతపై చేసిన కామెంట్స్‌పై వివరణ కోరిన అధిష్టానం...కొండాపై చర్యలు ఉండే అవకాశం!
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం జేకేఎన్సీ 33-35,బీజేపీ 23-27,కాంగ్రెస్ 13-15,జేకే పీడీపీ 7-11,ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. సీఎంగా ఒమర్ అబ్దుల్లాకు ఎక్కువ శాతం మంది ఓటు వేశారు.