Palnadu SP Ravi Shankar Reddy (Photo-Twitter)

Guntur, Feb 2: పల్నాడు జిల్లాలో కాల్పుల ఘటన కలకలం (Palnadu Shooting) రేపిన సంగతి విదితమే. జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ కి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై గురువారం ఉదయం దుండగులు కాల్పులు జరిపారు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆయనపై రెండురౌండ్లు కాల్పులు (Macherla TDP Former MPP Attack) జరిపి పారిపోయారు. తూటాలు పొత్తికడుపులోకి దూసుకుపోవడంతో హుటాహుటినా ఆయనను నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు.

ఇంకో మూడు నెలల్లో విశాఖకు అన్నీ షిఫ్ట్ చేస్తాం, రాజధాని తరలింపుపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు, అవసరమైతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటామని వెల్లడి

ఈ కాల్పులపై పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి (Palnadu SP Ravi Shankar Reddy) కీలక వివరాలను వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాలకోటిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డికి మధ్య వివాదాలు ఉన్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలే కాల్పులకు కారణం. ఎంపీటీసీ పదవి ఇప్పిస్తానని వెంకటేశ్వర రెడ్డి వద్ద బాలకోటిరెడ్డి రూ.6.50 లక్షలు తీసుకున్నాడు. బాలకోటిరెడ్డిని చంపడానికి రూ.4.50 లక్షల డీల్‌ జరిగింది. రాజస్థాన్‌ నుంచి రూ.60వేలకు గన్‌ కొన్నారు.

ఏపీ రాజధానిగా విశాఖపట్నం, ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం జగన్, ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా విశాఖకు ఆహ్వానిస్తామని వెల్లడి

రాత్రి గుర్తు తెలియని వ్యక్తి శివారెడ్డి పేరుతో డోర్‌ తట్టారు. ఈ క్రమంలో తలుపు తీసిన వెంటనే బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపాడు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశాము అని తెలిపారు.కొద్దిరోజుల క్రితం ప్రత్యర్థులు ఆయనపై కత్తులతో దాడులకు పాల్పడ్డారు. తాజాగా మరోసారి ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.