ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వడంపై వివాదం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రవచనకర్తగా పేరుపొందిన విషయం తెలిసిందే. ఈ నెల 30 తేదీన గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా చాగంటి కోటేశ్వరరావుకు అవార్డు ప్రదానం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ప్రస్తుతం దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Hyderabad Metro: డిసెంబర్ 9న సీఎం కెసిఆర్ శంషాబాద్, మైండ్ స్పేస్ వరకూ సెకండ్ ఫేజ్ మెట్రో రైలుకు శంకుస్థాపన
గురజాడ గౌరవయాత్ర పేరుతో సాహితీ, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. గురజాడ అవార్డును చాగంటికి ఇవ్వడం సరికాదని నినాదాలు చేశారు. విజయ నగర పట్టణంలోని గురజాడ విగ్రహం వద్ద పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు గతంలో మహిళలపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాంటి వ్యక్తికి గురజాడ లాంటి సంస్కర్త అవార్డు ఇవ్వడం అవమానకరమని పలువురు సాహితీ ప్రముఖులు విమర్శిస్తున్నారు.