Khammam, Aug 15: ఖమ్మం సీతారామ ప్రాజెక్టులోని పూసుగూడెం పంప్‌హౌస్‌ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గోదావరి నీళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వవరరావుతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు.
అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. హరీష్ రావు, కేసీఆర్ లను పట్టించుకోం...వాళ్ళు కాలం చెల్లిన రూపాయి అని మండిపడ్డారు. మోటార్లు వచ్చి నాలుగేళ్లు అయినా..కరెంట్ కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.కృష్ణ జలాల మీద ఆధారపడకుండా ఖమ్మం జిల్లాలో గోదావరి జలాల నీళ్ళని అందిస్తున్నాం అన్నారు. గొల్కోండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, పెద్దన్నగా చెబుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ
Here's Video:
సీతారామ ప్రాజెక్టు పంప్ 2 వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
ఎమ్మెల్యేలు కూనంనేని, తెల్లం వెంకట్ రావు.#CMrevanthreddy #Congress #Khamma #SeethaRamaProject #NewsUpdates #Bigtv@INCTelangana… https://t.co/WkJw6aozrI pic.twitter.com/ybKgOn57qh
— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2024
మామా అల్లుళ్లు కలిసి గోదావరి నీళ్లను నెత్తిన చల్లుకోవాలని చురకలు అంటించారు. పదేళ్లు అధికారంలో ఉన్న హరీష్ రావు ఈ పనిని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం అన్నారు. అడవి పందుల మాదిరిగా కేసీఆర్ కుటుంబం తెలంగాణాను విధ్వంసం చేసిందన్నారు. అప్పుల భారం ఉన్నా పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ నిధులను కేటాయిస్తున్నాం అన్నారు.