Cyclone Bulbul: 20 dead and millions displaced as storm hits India and Bangladesh (Photo-Twitter)

Kolkata,November 11: బుల్‌బుల్‌ తుపాన్‌ (Cyclone Bulbul)పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటినా బుల్‌బుల్‌... పశ్చిమ బెంగాల్‌(West Bengal state), ఒడిశా(Odisha state) తీరాలను వణికిస్తోంది. ఆదివారం ఈ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లను కుదిపేసింది. దీని ధాటికి పశ్చిమ బెంగాల్ లో 10 మంది, బంగ్లాదేశ్‌(Bangladesh )లో 10 మంది, ఒడిశాలో ఇద్దరు మృతి చెందారు. భారీ వర్షాలతో పాటు విపరీతంగా గాలులు వీస్తుండటంతో కోలకతా నగరంతో పాటు పలు ప్రాంతాల్లో చాలా మంది నిరాశ్రయులయ్యారు.

శనివారం రాత్రి తీరం దాటిన సమయం నుంచి ఆదివారం ఉదయం వరకూ తీవ్రగాలులు, వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.కోస్తాలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని వెల్లడించింది.

బుల్‌బుల్‌ తుపాన్‌ దెబ్బ

బుల్‌బుల్‌ తుఫానుధాటికి వేల హెక్టార్లలో పంటలు నాశనం అయ్యాయి. బెంగాల్‌లో 2.73 లక్షల కుటుంబాలపై తుఫాను ప్రభావం చూపినట్టు అధికారులు తెలిపారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేసి తుఫాను పరిస్థితులపై ఆరా తీశారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్‌, కోల్‌కతా నగరంలో పలు కేబుళ్లు ధ్వంసమయ్యాయి.

ఒడిషాలో బుల్ బుల్ దెబ్బ

తుఫానుధాటికి 12 మంది మత్స్యకారులు గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు. తుఫానుధాటికి కనీసం 2,437 ఇండ్లు పూర్తిగా, మరో 26 వేల ఇండ్లు పాక్షికంగా ధ్వంసమైనట్టు రాష్ర్ట విపత్తు నిర్వహణ శాఖ మంత్రి జావేద్‌ఖాన్‌ తెలిపారు. 1.78 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు.

ఒడిశాపై కూడా బుల్‌బుల్‌ ప్రభావాన్ని చూపింది. ఇక బుల్‌బుల్‌ తుఫాను పొరుగు దేశం బంగ్లాదేశ్‌ మీద కూడా తన ప్రభావాన్ని చూపుతున్నది. తుఫానుధాటికి ఇప్పటివరకు ఆ దేశంలో పది మంది పౌరులు మృతిచెందారు