Andhra Pradesh Education Minister Adimulapu Suresh. (Photo Credits: ANI)

Amaravati, July 22: ఏపీలో కొవిడ్‌–19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభించాలని (AP Schools Reopen Date) నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మెరుగైన విద్య, విద్యార్థులకు రుచికరమైన జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం)పై మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం అనంతరం మంత్రి (Education Minister Adimulapu Suresh) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో సెప్టెంబర్ లోపు పీజీ,యూజీ పరీక్షల నిర్వహణ, మీడియాకు వెల్లడించిన ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి

ఇంగ్లిష్‌ మీడియం, జగనన్న గోరుముద్దలను పకడ్బందీగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్‌ స్థాయి పోస్టులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ విధివిధానాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. కడపలో వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజేత స్కూల్‌ మాదిరిగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగ విద్యార్థులకు విద్యా బోధన సాగించేందుకు రిసోర్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.

స్కూల్స్‌ ప్రారంభించే వరకు జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు మూడో విడత డ్రైరేషన్‌ పంపిణీ కొనసాగించాలని సీఎం ఆదేశించారు. ఆన్‌ లైన్లో స్కూళ్లకు అనుమతులు, గుర్తింపు పత్రాలు జారీ చేయనున్నాం. ఇకపై ప్రతి ఏటా అకడమిక్‌ ఆడిటింగ్‌ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు.

విద్యా రంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతూ పలు కీలక నిర్ణయాలు

ఆరు సంవత్సరాలలోపు పిల్లల కోసం ప్రీ ప్రైమరీ–1 (ఎల్‌కేజీ), ప్రీ ప్రైమరీ–2 (యూకెజీ)లను ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కిండర్‌ గార్డెన్స్‌ (ఎల్‌కేజీ, యూకేజీ)పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. విద్యా రంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. నాణ్యమైన విద్య, మానవ వనరుల సమర్థ వినియోగం, ఉత్తమ బోధన తదితర అంశాలపై ఏపీ సీఎం సమీక్ష చర్చించారు. స్కూలు పిల్లల కోసం రూపొందించిన పాఠ్య పుస్తకాలను పరిశీలించారు.