CBSE 10th Result 2021 Declared Representational Image (Photo Credits: PTI)

New Delhi, August 3: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు (CBSE 10th Result 2021 Declared) మంగళవారం వెల్లడయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

ఇంటర్నల్స్‌, యూనిట్‌ టెస్ట్స్‌, మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్‌ పరీక్షలలో విద్యార్థుల పనితీరును బట్టి మార్కులు కేటాయించారు. పరీక్షలు నిర్వహించకుండా సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ప్రకటించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ఈ ఫలితాలు జులై 20న విడుదల చేయాల్సి ఉంది. అయితే.. స్కూళ్లు మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం చేయడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది.

కరోనావైరస్ ఉద్ధృతి దృష్ట్యా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గతవారం 12వ తరగతి ఫలితాలను విడుదల చేయగా.. రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు బీ అలర్ట్, సెప్టెంబర్‌19న ఏపీ ఈసెట్‌, ఆగష్టు 12 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు, వెయ్యి రూపాయల ఫైన్‌తో ఆగస్టు 23 వరకు అవకాశం

CBSE 10th Result 2021: ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి

Step 1: Visit the official website cbseresults.nic.in

Step 2: Click on the result link available on the homepage

Step 3: Log-in using credentials

Step 4: Result will appear, take a print out of the scorecard for further reference

కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించలేనందున, 10 వ తరగతి విద్యార్థులకు CBSE ఫలితాలు ప్రత్యామ్నాయ మూల్యాంకనం ఆధారంగా తయారు చేయబడ్డాయి. ఈ ప్రత్యామ్నాయ మూల్యాంకన ప్రణాళిక ప్రకారం, 20 మార్కులు పాఠశాలల ద్వారా నిర్వహించిన అంతర్గత అంచనాలపై ఆధారపడి ఉంటాయి, 10 మార్కులు ఆవర్తన/యూనిట్ పరీక్షలకు కేటాయించబడతాయి, 30 మార్కులు అర్ధ సంవత్సరం పరీక్షలకు కేటాయించబడతాయి. 40 మార్కులు ప్రీ-బోర్డు పరీక్ష స్కోర్లుకు కేటాయించబడతాయి.