New Delhi, May 18: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) సోమవారం పెండింగ్ లో ఉన్న 10వ తరగతి మరియు 12 వ తరగతి పరీక్షల తేదీ షీట్ (CBSE Class 10, 12 Board Exam 2020) ప్రకటించింది. ఇది ఇప్పుడు జూలై 1-15 నుండి జరుగుతుంది. COVID-19 వ్యాప్తి నియంత్రణకు దేశ వ్యాపంగా లాక్ డౌన్ విధించడంతో మార్చి 25 న దేశవ్యాప్తంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇంటర్ పరీక్షల డేట్‌షీట్‌ను విడుదల చేసింది. ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు, తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి, ఇంగ్లీష్ మీడియంపై జీవో జారీ చేసిన ఏపీ సర్కారు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం
సీబీఎస్‌ఈ ఇంటర్ ఆల్ ఇండియా పరీక్షలతోపాటు, ఈశాన్య ఢిల్లీలో పెండింగ్ లో ఉన్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన తేదీలను బోర్డు సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. జూలై 1 నుంచి 15 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 1, 2, 7, 9, 10, 11, 13 తేదీల్లో సీబీఎస్‌ఈ ఇంటర్ ఆల్‌ఇండియా పరీక్షలు జరుగుతాయి. జూలై 3, 4, 6, 8, 14, 15 తేదీల్లో సీబీఎస్‌ఈ ఇంటర్ నార్త్‌ఈస్ట్ ఢిల్లీ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలన్నింటిని ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తారు.
సిబిఎస్ఇలో ఆన్‌లైన్‌లో మిగిలి ఉన్న పరీక్షల కోసం టైమ్‌టేబుల్‌ను cbse.nic.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. విద్యార్థుల ఆరోగ్య మార్గదర్శకాలపై భరద్వాజ్ మాట్లాడుతూ, వారు సొంతంగా శానిటైజర్ బాటిళ్లను తీసుకెళ్లాలి మరియు వారి పరీక్షా కేంద్రాలకు మాస్కులు ధరించి రావాలని తెలిపారు.