Hyderabad, December 24: తెలంగాణ (Telangana)లో ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి 2020 ఏడాదికి గానూ వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్టుల పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థుల కోసం జెఎన్‌టియు హైదరాబాద్ నిర్వహించే EAMCET-2020 పరీక్ష మే 5, 6 మరియు మే7 తేదీలలో జరుగుతుందని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేటన్ (TSCHE) చైర్మన్ టి. పాపి రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎంసెట్ మే 9 మరియు 11 తేదీలలో జరగనుంది.
తెలంగాణ రాష్ట్రంలో BE, B.Pharm టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే బీ.ఎస్సీ మ్యాథ్స్ మరియు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే TS ECET పరీక్ష తేదీని మే2, శనివారం రోజున నిర్ణయించారు. SSC మరియు ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్ టేబుల్ కూడా గమనించండి
ఎంబీఎ మరియు ఎంసీఎ ప్రవేశాల కోసం వరంగల్ - కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించే TS ICET -2020 పరీక్ష మే20 మరియు మే21 తేదీల్లో ఖరారు చేశారు.
Here's the schedule for 2020:
ఇక వీటితో పాటు మే23న ఎడ్ సెట్ (EdCET), మే25న లాసెట్మ (LAWCET) రియు పీజీ లాసెట్ అలాగే మే 27 నుంచి మే 30 వరకు పీజీ ఈసెట్ ( పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.