Hyderabad, June 8: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు (Telangana SSC Board exam 2020) రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులను ప్రమోట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం, కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ అసహనం, 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు
ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితిల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం పేర్కొంది.
ఇంటర్నల్, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. డిగ్రీ, పిజి తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతి, ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్, ధియేటర్లు ప్రారంభించడానికి అనుమతి నిరాకరించిన తెలంగాణ సర్కారు
హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలతో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిస్తూ హైకోర్టు శనివారం తీర్పునివ్వగా అలా వేర్వేరుగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం సోమవారం నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే. ఇప్పటికే హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాలు టెన్త్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి నేడు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకుని పదో తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.