TS EDCET-2022: టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌ల, రెండేండ్ల బీఎడ్ కోర్సుకు ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు
Representational Image (Photo Credits: PTI)

తెలంగాణలో టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి గానూ రెండేండ్ల బీఎడ్ కోర్సుకు (TS EDCET-2022) సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి, ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ రామ‌కృష్ణ‌, ఎడ్‌సెట్ కో క‌న్వీన‌ర్ శంక‌ర్ విడుద‌ల చేశారు. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఆల‌స్య రుసుంతో జులై 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. జులై 26, 27 తేదీల్లో ఎడ్‌సెట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రంలోని 220 బీఎడ్ క‌ళాశాలల్లో 19,600 సీట్లు క‌ల‌వు. గ‌తేడాది నిర్వ‌హించిన ఎడ్‌సెట్‌లో 33,683 మంది విద్యార్థులు అర్హ‌త సాధించారు.

ఇక రాష్ట్రంలోని బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు మాప్ అప్ నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. కన్వీనర్ కోటలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5 న మధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్ విడుదల, ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు

గత విడత కౌన్సిలింగ్‌లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా అదే విధంగా అల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్ కు అనర్హులు. ఇత‌ర వివ‌రాల‌కు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివ‌ర్శిటీ వ‌ర్గాలు సూచించాయి.