TS SSC Exam Time Table 2023: పరీక్షల్లో కీలక మార్పులు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం, తొమ్మిది, పదో తరగతులకు ఇక ఆరు పేపర్లే, ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80 మార్కులు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు
File image of Minister Sabitha Indra Reddy | File Photo.

Hyd, Dec 28: తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నది. 2022-23 నుంచి విద్యా సంస్కరణలను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు.సైన్స్‌పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించింది. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు, ఆరు పేపర్ల పరీక్ష విధానాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం

ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం పది వార్షిక పరీక్షలను 11 నుంచి ఆరు పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తాజాగా తొమ్మిది, పది తరగతులకు ఆరేసి పేపర్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ‌తంలో తెలుగు, ఇంగ్లీష్‌, గ‌ణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం స‌బ్జెక్టుల‌ను రెండు పేప‌ర్లుగా నిర్వహించేవారు. ఇక హిందీ స‌బ్జెక్ట్‌కు ఒకే ప‌రీక్ష పరీక్ష నిర్వహించేవారు.