తెలంగాణలో ఈ నెల 28న జరగాల్సిన రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదాపడింది. వాయిదా పడిన కౌన్సెలింగ్‌ను వచ్చే నెల (అక్టోబర్) 11 నుంచి నిర్వహించనున్నట్లు ( TS EAMCET Counselling Update) టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అక్టోబర్ 11, 12న రెండో విడత స్లాట్ బుకింగ్‌తో పాటు అదే రోజు ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. 12, 13 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 16న రెండో విడుత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు.
ఫీజుల విషయంలో కొలిక్కి రాకపోవడంతో రెండో విడత కౌన్సెలింగ్‌ను (TS EAMCET Second Phase Counselling) వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఈ సారి ఎంసెట్ ఇంజినీరింగ్‌లో ప్రవేశాల ప్రక్రియను మూడు విడుతల్లో తెలంగాణ ఉన్నత విద్యామండలి చేపడుతున్నది. ఇప్పటికే తొలి విడుత ఆగస్టు 21న ప్రారంభమైన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం రెండో విడత ఈ నెల 28న ప్రారంభం కావాల్సి ఉండగా.. మూడో విడుత అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నది.