TS ICET 2020 Full Schedule Released | File Photo

Warangal, March 6: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ టీఎస్ ఐసెట్-2020 పరీక్ష షెడ్యూల్ ను శుక్రవారం ప్రకటించింది. కాకతీయ యూనివర్శిటీ  (Kakatiya University) రిజిస్ట్రార్ పురుషోత్తం ఈ షెడ్యూల్ (TS ICET-2020 Schedule) ను ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం, మార్చి 9వ తేదీ నుంచి ఐసెట్ 2020 కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ మార్చి 30.  అయితే ,  రూ. 500 అపరాధ రుసుముతో మే 14 వరకు,  అయితే  రూ. 5000 అపరాధ రుసుముతో మే 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.  మే 20 మరియు 21 తేదీల్లో పరీక్ష నిర్వహించబడుతుంది.

తెలంగాణ వ్యాప్తంగా 10 పరీక్షా కేంద్రాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ తెలిపారు. ఈ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించని నిబంధన అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మే 14వ తేదీ నుంచి అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది:

Events Dates
 TS ICET 2020 Schedule Release March 6, 2020
 Filing of application forms begin March 9, 2020
 Last date for filing application forms March 30
 Last date for filing application forms with late fee May 14 to 16, 2020
 Admit Cards Release May 14, 2020
 TS ICET 2020 Exam Dates May 20 & 21, 2020

 

ఎంబీఎ మరియు ఎంసీఎ  వృత్తి విద్యా కోర్సుల్లో చేరే వారికోసం కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ ద్వారా తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) నిర్వహించబడుతుంది.

టీఎస్ ఐసెట్ 2020 యొక్క ప్రాథమిక ఆన్సర్స్ కీ మే 27 విడుదలవుతుంది, జూన్ 12న ఫలితాలు ప్రకటించబడతాయి.