TS Inter 2nd Year Exam 2021: తెలంగాణలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు, ఫస్ట్‌ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్‌, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
Exams Representational Image. |(Photo Credits: PTI)

Hyderabad, june 9: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను రద్దు (Inter 2nd year Exams 2021 Cancelled) చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు (TS Inter Exams 2021 రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంటర్‌ సెకండియర్‌కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టతరంగా మారింది. రాష్ట్ర స్థాయిలో పదో తరగతి పరీక్షలను, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను ఇప్పటికే రద్దు చేశారు.

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు కరోనా తగ్గిన తర్వాతే..మీడియాతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల

పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసింది. అయితే సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేస్తూ.. జూన్ నెలలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.