
TS Inter Results 202: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కావడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో విడుదలయ్యే అవకాశం (TS Inter Results 2021) ఉందని బోర్డు అధికారులు తెలిపినట్లుగా ఎన్టీటీవీ తెలిపింది. కాగా కరోనా పరిస్థితుల కారణంగా వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే సెకండియర్‌లో (Telangana Intermediate exam results 2021) ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత, ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు
ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం లేదా మంగళవారం ఫలితాలను విడుదల చేయనున్నారు. మొత్తం 4,73,967 మంది విద్యార్థులు ఉండగా వారిలో 1,99,019 మంది తొలి ఏడాదిలో కొన్ని సబ్జెక్టుల్లో తప్పినవారున్నారు. వీరికి ఆ సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులు ఇవ్వనున్నారు. ఫలితాలను ఇంటర్ బోర్డు (www.tsbie.cgg.gov.in) తో పాటు ఇతర వెబ్‌సైట్లలో ఉంచనున్నారు.