Representative Image (Photo Credit: PTI)

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్-స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS SET - 2022) నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు (Application) ప్రక్రియ డిసెంబరు 30 నుంచి ప్రారంభం కాగా.. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగింది. తాజాగా తెలంగాణ స్టేట్-స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2022 కు సంబంధించిన పరీక్ష తేదీలను అధికారులు విడుదల చేశారు.

అధ్యాపక ఉద్యోగాల అర్హతకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్‌సెట్‌–2022)లను మార్చి 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు మెంబర్‌ సెక్రటరీ మురళీకృష్ణ గురువారం తెలిపారు. ఈనెల 25న చివరి తేదీ గడువు ముగిసేనాటికి వివిధ సబ్జెక్టులకు 49 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

ఏపీలో మే 15 నుంచి ఈఏపీసెట్‌, అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను విడుదల చేసిన APSCHE, పూర్తి వివరాలు కథనంలో..

రూ.1,500 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 5 వరకు, రూ.3,000 అపరాధ రుసుముతో 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. తెలంగాణలో పది పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో 4 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలను టీఎస్‌సెట్‌–2022 వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు