TS Inter Result 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలకు రెడీ, ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు, జూన్ 16,17వ తేదీల్లో వెలువడే అవకాశం
7 learning and education apps offering free access during the coronavirus lockdown| (Photo Credits: PTI)

Hyderabad, June 15: ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఫలితాలు (Telangana Inter Results 2020,) విడుదల కాబోతున్నాయి. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఫలితాలను (TS Inter Result 2020) ఒకేసారి విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల విద్యార్థుల వాల్యూషన్ ప్రక్రియ పూర్తి అవడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలు ఒకే రోజు విడుదల, పాసయ్యారో లేదో చెక్ చేసుకోవడం ఎలా ?

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు (Telangana State Board of Intermediate Education) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, ప్రథమ సంవత్సరం ఫలితాలను ప్రభుత్వ ఆదేశాల తర్వాత ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఫలితాలపై రేపు సాయంత్రంలోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, ప్రభుత్వం ఆదేశిస్తే ఈ నెల 15న ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు (TSBIE) కార్యదర్శి ఉమర్ జలీల్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

జూన్ 16న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఒకవేళ వీలుకాకపోతే జూన్ 17న ఖచ్చితంగా ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుతు తెలంగాణ ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. నేడు, తెలంగాణ ఇంటర్‌ బోర్డు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (P Sabitha Indra Reddy) వద్ద ఆమోదం తీసుకోనున్నారు. మంత్రి ఆమోదం పొందిన తర్వాత 16న లేదా 17వ తేదీలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు, ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడులు, అందరూ పై తరగతికి ప్రమోట్

ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నెల లోపలే రావలసిన ఇంటర్ ఫలితాలు లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల కసరత్తుతో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. ఫలితాల విడుదల తర్వాత సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని జలీల్ పేర్కొన్నారు. ప్రస్తుతం బోర్డు అధికారులు స్కానింగ్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇక గతేడాది తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఎంతటి తీవ్ర పరిణామాలు సృష్టించాయో తెలిసిందే. ఈసారి అలాంటి పొరబాట్లు పునరావృతం కావని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు చెబుతోంది.