Representational Image | File Photo

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక‍్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను (TS TET Results 2022) అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే టెట్‌ ఫైనల్‌ కీని టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ నెల 15న ప్రైమరీ కీ విడుదలవగా.. జూన్ 29న టెట్ ఫైనల్ కీని అధికారులు విడుదల చేశారు. ఈ కీలో కొన్ని ప్రశ్నలకు మార్కులను కలుపగా.. మరికొన్ని ప్రశ్నలు డబుల్ సమాధాలను ఇచ్చారు. పేపర్ 1లో 4 మార్కులను కలపగా.. మరో 4 ప్రశ్నలకు రెండు సమాధానాలను గుర్తించారు.

ఆగ‌స్టు 1 నుంచి పదోతరగతి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు, ఫెయిలైన విద్యార్థులు జులై 18వ తేదీ లోపు సంబంధిత పాఠ‌శాల‌ల్లో ఫీజు చెల్లించాలని తెలిపిన మంత్రి

మొత్తంగా 8 ప్రశ్నలకు మార్పులు చేశారు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే.. మ్యాథమేటిక్స్ , సైన్స్ మరియు సోషల్ స్టడీస్ కీలో నాలుగు మార్కులను కలుపగా.. మరో ప్రశ్నకు రెండు సమాధానాలను గుర్తించారు. ఇక, జూన్‌ 12న నిర‍్వహించిన టెట్‌ పరీక్ష పేపర్‌-1కు 3,18,506, పేపర్‌-2కు 2,51,070 మంది అభ‍్యర్థులు హాజరయ్యారు. దీనిలో మొత్తల 5 ప్రశ్నలకు మార్పులు చేశారు. పేపర్-1కు సంబంధించి మొత్తం 7,930 అభ్యంతరాలు రాగా.. పేపర్ 2కు సంబంధించి మొత్తం 4,663 అభ్యంతరాలు రావడంతో అధికారులు వాటిని పరిశీలించి తుది కీని జూన్ 29 అర్థరాత్రి విడుదల చేశారు. ఎట్టకేలకు ఈ టెట్ ఫలితాలు జులై 1వ తేదీన విడుద‌ల అయ్యాయి.