Hyderabad, January 6: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) ద్వారా వివిధ విభాగాల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ (Food Safety Officers) నోటిఫికేషన్ (TSPSC Notification) విడుదలైంది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ నియామక డ్రైవ్ కింద మొత్తం 36 ఖాళీలు విడుదల చేయబడ్డాయి, వీటిలో 10 ఖాళీలు ఐపిఎంకు, 26 ఖాళీలు జిహెచ్ఎంసికి ఉన్నాయి.
ఫుడ్ టెక్నాలజీ లేదా డెయిరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఆయిల్ టెక్నాలజీ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్సెస్ లేదా బయో కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ లేదా కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ లేదా మెడిసిన్ డిగ్రీలో డిగ్రీ కలిగిన అభ్యర్థులు లేదా ఏదైనా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి తత్సమాన డిగ్రీ కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నిర్ధేషించిన విద్యార్హతలు తెలిపే సరైన పత్రాలు కలిగిన వారు tspsc.gov.in ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 6, 2020 నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 25, 2020.
వయసు పరిమితి 18 మరియు 34 సంవత్సరాల మధ్య (పుట్టిన తేదీ 01.07.2001 నుంచి 02.07.1985 మధ్య జన్మించిన వారై) ఉండాలి.
రాత పరీక్ష ద్వారా ఉద్యోగాల నియామకం జరుగుతుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ. 28,940 నుంచి రూ. 78,910 వరకు ఉంటుంది, ఇతర జీతభత్యాలు అదనం.
నియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ లో పేర్కొన నిబంధనలు పూర్తిగా చదివిన తర్వాతనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియను కొనసాగించే ముందు అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో ‘వన్-టైమ్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియలో నమోదు చేసుకోవాలి.