UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ – 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వారిలో ఇషితా కిషోర్ అనే యువతి ఆలిండియా టాపర్‌గా నిలిచారు. ఈసారి మొదటి నాలుగు ర్యాంకులను మహిళలే సొంతం చేసుకున్నారు. టాపర్‌గా ఇషిత నిలువగా.. గరిమా లోహియా, ఉమా హారతి ఎన్, స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకుల్లో ఉన్నారు. ఫలితాలను upsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచు.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) తోపాటు గ్రూప్ A, గ్రూప్ B కేటగిరీలకు చెందిన కేంద్ర సర్వీసులలో నియమకాల కోసం UPSC గత ఏడాది సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్టు కోసం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూ చేసింది.
ఫైనల్‌గా 933 మందిని వేర్వేరు సర్వీసులకు ఎంపిక చేసింది. మొత్తం 345 మంది జనరల్ కోటాలో ర్యాంకులు సాధించారు. ఇక 99 మంది EWS కోటాలో, 263 మంది OBC కోటాలో, 154 మంది SC కోటాలో, 72 మంది ST కోటాలో 2022 సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు.