Newdelhi, Aug 16: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోనే దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) సంబంధించిన షెడ్యూల్ ను నేడు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రకటించనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఏ రాష్ట్రాల షెడ్యూల్ విడుదల చేయనుందో ప్రకటనలో వెల్లడించలేదు.
#ElectionCommission to announce schedule for upcoming #Assembly elections today. #JammuKashmir, #Maharashtra, #Haryana. @TheWeekLive pic.twitter.com/k5W8pLvFOA
— Soni Mishra (@SoniMishra20) August 16, 2024
ఏ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగొచ్చు అంటే?
హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల షెడ్యూల్ వెలువడనున్నట్లు సమాచారం. నవంబర్ నెలతో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగియనుంది. జార్ఖండ్ చట్టసభ పదవీకాలం జనవరితో ముగియనుంది. దీంతో ఈ మూడు రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల కానుందని సమాచారం. అలాగే జమ్మూకశ్మీర్ లో శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దాంతో ఇక్కడ ఎన్నికల తేదీని కూడా ప్రకటించొచ్చని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.