కరోనా కారణంగా ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్‌ను వచ్చే ఏడాది 2021కు వాయిదా వేస్తున్నట్లు (Asia Cup 2020 postponed) ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రకటించింది. ఆసియా ఖండంలో కోవిడ్–19 (COVID-19) తీవ్రత పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేసింది. ‘అన్ని రకాల పరిస్థితులను అంచనా వేసిన తర్వాత సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను వాయిదా వేయడమే మంచిదని ఏసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు భావించింది. అంచనాలు లేకుండానే విశ్వవిజేత, భారత్ తొలి ప్రపంచకప్ సాధించి నేటితో 37 ఏళ్లు, ఈ తీపి గుర్తులపై స్పెషల్ స్టోరీ
షెడ్యూల్ ప్రకారమే దీనిని నిర్వహించాలని మేం ముందుగా అనుకున్నా...ప్రయాణాలపై ఆంక్షలు, ఒక్కో దేశంలో ఒక్కో రకమైన క్వారంటైన్ నిబంధనలు, సోషల్ డిస్టెన్సింగ్ తదితర అంశాలను బట్టి చూస్తే ఎన్నో సవాళ్లు ఉంటాయి. అన్నింటికి మించి ఆటగాళ్ల ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి వాయిదా తప్పలేదు’ అని ఏసీసీ ట్వీట్ చేసింది.
ఈ ఈవెంట్ వచ్చే ఏడు బహుశా శ్రీలంకలో జరగొచ్చు. రద్దు నిర్ణయం వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. ఆతిథ్యానికి మేం కట్టుబడే ఉన్నాం. అయితే, యూఏఈ, పాకిస్థాన్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో వైరస్ తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో టోర్నీని రద్దు చేయక తప్పలేదు’ అని పీసీబీ చీఫ్ ఎహ్‌సాన్ మణి ప్రకటించాడు. ఆసియా కప్ రద్దుకు తోడు అక్టోబరు-నవంబరులో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ కూడా జరిగే అవకాశాలు లేవన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. పూర్తిస్థాయిలో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐకి మార్గం సుగమమైనట్టే.