
Delhi, Feb 2: మహారాష్ట్ర ఎన్నికల పలితాలపై సందేహాలు వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi). మీడియాతో మాట్లాడిన రాహుల్.. కొత్తగా చేరిన ఓట్లే ఆ కూటమి పార్టీలకు విజయాన్ని అందించాయి అన్నారు. లోక్ సభ ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల మధ్య 39 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని..వీరి వల్లే కూటమి ప్రభుత్వం విజయం సాధించిందన్నారు.
మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నాం అన్నారు రాహుల్. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని నేను లేవనెత్తినప్పటికీ ఈసీ నుంచి సమాధానం రాలేదు అన్నారు. తాను ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు చేయడం లేదని.. గణాంకాలు, డేటా ముందు పెట్టి సందేహాలను నివృత్తి చేయాలని కోరుతున్నా అన్నారు. కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. సెక్టార్ 18లో ఘటన, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో ఇదిగో
మహారాష్ట్రలో(Maharashtra Elections) ఓటు హక్కు కలిగిన వారి సంఖ్య 9.54 కోట్లు… కానీ 9.7 కోట్ల మంది ఓటేశారు ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ పారదర్శకతను నిరుపించుకోవడం బాధ్యత అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల వరకు 32 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారు.
అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల నుండి అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కేవలం ఐదు నెలల్లోనే 39 లక్షల ఓటర్లు జాబితాలో ఎలా చేర్చబడ్డారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో 13% ఓటర్ల సంఖ్య పెరగడం ఆశ్చర్యకరమైన విషయం అని తెలిపారు రాహుల్.