Cyclone Pawan Alert: వణికిస్తున్న అరేబియా మహాసముద్రం, పవన్ తుఫాను స్టార్టయింది. ఇప్పటికే మహా, క్యార్‌ తుఫాన్లతో జనజీవనం అతలాకుతలం, ఇండియాకు పవన్ సైక్లోన్ వల్ల అంత ప్రమాదం లేదంటున్న వాతావరణ శాఖ అధికారులు
Arabian Sea to see 5th cyclone Pawan, this year veers away from India (photo-PTI)

News Delhi, December 6: తుఫాన్లు తమ స్థావరాన్ని మార్చుకున్నాయి. ఇప్పటిదాకా బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడేవి. అయితే ఈ సారి అలా కాకుండా అరేబియా సముద్రం(Arabian Sea)లో అవి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం నైరుతి అరేబియాలో ఆఫ్రికా తీరంలో ‘పవన్‌’ తుఫాన్‌ (Cyclone pawan) కొనసాగుతుండగా, కర్ణాటక (Karnataka) తీరానికి ఆనుకుని తూర్పుమధ్య అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతోంది. దీనికితోడు మాల్దీవులు సమీపంలో శుక్రవారానికి మరో అల్పపీడనం ఏర్పడనుంది.

ఒక సముద్రంలో ఒకేసారి ఒకటి అంతకంటే ఎక్కువ వాయుగుండాలు/తుఫాన్లు ఏర్పడడం చాలా అరుదుగా చెప్పవచ్చు. ఈ ఏడాది అరేబియాలో మహా, క్యార్‌ తుఫాన్లు (cyclones Kyarr and Maha)ఒకేసారి వచ్చాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో తుఫాన్ల జోరు కొనసాగేది. అయితే భూతాపం ప్రభావంతో ఈ ఏడాది అరేబియాలో తుఫాన్ల పరంపర కొనసాగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

నైరుతి అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన తుఫానుకు శ్రీలంక (Srilanka) దేశం ప్రతిపాదించిన 'పవన్‌' (Pawan)అని పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాలోని సోమాలియా దిశగా ప్రయాణిస్తోందని.. శుక్రవారంలోపు బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.అయితే దీని వల్ల ఇండియాకు అంత ప్రమాదం ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

డిసెంబర్ ప్రవేశంతోనే తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలను చలి చంపేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు కొంత పర్వాలేదన్నట్లు ఉన్నా రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం పడిపోతున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈ ఏడాది చలి అంతగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చుని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంటున్నారు .గతంలోలా నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. డిసెంబరు, జనవరి నెలల్లో ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పది డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. జనవరి నెలలో ఏకంగా నాలుగైదు డిగ్రీలు నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయి.