Bank Holidays in August 2021: ఆగస్టు నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవులు, పూర్తి సమాచారం కథనంలో..
Bank | Representative Image (Photo Credits: PTI)

Mumbai, July 31: కరోనా వల్ల జూన్​లో బ్యాంకులు పని సమయాన్ని కొంత తగ్గించినప్పటికీ.. జులై నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆర్​బీఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులు ఆగస్టు నెలలో మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవుల్లో (Bank Holidays in August 2021) ఉండనున్నాయి. ఈ నెల 1, 8, 15, 22, 29 తేదీల్లో బ్యాంకులు పని చేయవు. ఈ తేదీల్లో ఆదివారాలు వస్తాయి. అలాగే ఆగస్ట్ 14, 28 తేదీల్లో కూడా బ్యాంకులు (Bank Holidays 2021) ఉండవు. రెండు, నాలుగో శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంది.

అలాగే ఆగస్ట్ 19న మొహరం సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఇంకా ఆగస్ట్ 30న జన్మాష్టమి సందర్భంగా బ్యాంకులు క్లోజ్‌లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవే సెలవులు వర్తిస్తాయి. ఇకపోతే ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. నెలాఖరు నాలుగు రోజుల్లో కేవలం ఒక్క రోజే బ్యాంకులు పని చేయనున్నాయి.దేశవ్యాప్తంగా..మొహరం సందర్భంగా ఆగస్టు 19, శ్రీ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 30న దేశవ్యాప్తంగా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి.

మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోయిందా, బ్లాక్ చేసి కొత్త కార్డు పొందడం ఎలాగో తెలుసుకోండి, కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

List of Bank Holidays (Photo Credits: File Image)

ఆగస్టు 16న పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులు పని చేయవు.ఆగస్టు 13, 16, 20, 21, 23 తేదీల్లోనూ పలు రాష్ట్రాల్లో వివిధ పండుగలు, ప్రత్యేక కారణాలతో బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి

ఆగ‌స్టులో సెల‌వులు ఇవే

ఆగస్టు 1- ఆదివారం

ఆగస్టు 8- ఆదివారం

ఆగస్టు 13- దేశ‌భ‌క్తుల దినోత్స‌వం

ఆగ‌స్టు 14- రెండో శ‌నివారం

ఆగ‌స్టు 15- స్వాతంత్ర్య దినోత్స‌వం, ఆదివారం

ఆగ‌స్టు 16- పార్శీ నూత‌న సంవ‌త్స‌రాది

ఆగ‌స్టు 19- మొహ‌ర్రం

ఆగ‌స్టు 20-మొహ‌ర్రం/ఫ‌స్ట్ ఓనం

ఆగ‌స్టు 21- తిరువోనం

ఆగ‌స్టు 22- ఆదివారం

ఆగ‌స్టు 23- శ్రీ నారాయ‌ణ గురు జ‌యంతి

ఆగ‌స్టు 28- నాలుగో శ‌నివారం

ఆగ‌స్టు 29- ఆదివారం

ఆగ‌స్టు 30- జ‌న్మాష్ట‌మి

ఆగ‌స్టు 31: శ్రీ కృష్ణాష్ట‌మి