Gas Cylinder Delivery Charges: గ్యాస్ సిలిండర్ డెలివరీకి అదనంగా డబ్బులు చెల్లించొద్దు.. రసీదుపై ఎంత ఉంటే అంతే చెల్లించాలి..  ఏపీ పౌరసరఫరాల శాఖ
Credits: Wikimedia Commons

Vijayawada, Jan 31: గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) డెలివరీ (Delivery) చేసే వారికి అదనంగా రుసుము (Pay) చెల్లించాల్సిన పని లేదని ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. రసీదుపై ఎంత ఉంటే అంతే చెల్లించాలని, అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదని అన్నారు. నిర్ణీత పరిధిలో ఉన్నప్పటికీ కొందరు డీలర్లు, డెలివరీ బాయ్‌లు (Delivery Boys) అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే జిల్లా పౌరసరఫరాల అధికారులు, ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని సూచించారు. తమ కాల్ సెంటర్ 1967, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని టోల్‌ఫ్రీ నంబరు 1800 2333555 నంబర్లకు కాల్  చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు.

మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం.. స్పష్టంగా చూసే అదృష్టం విజయవాడ వాసులకే!

కాగా, అధీకృత డీలర్ కార్యాలయం నుంచి వినియోగదారుడి నివాసం 5 కిలోమీటర్ల లోపు ఉంటే అదనంగా రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. 5 నుంచి 15 కిలోమీటర్ల లోపు ఉంటే కనుక రూ. 20, 15 కిలోమీటర్ల పైన ఉంటే రూ. 30 చెల్లించాలి.

అబూదాబి-ముంబై విస్తారా విమానంలో ఇటలీ మహిళ హల్ చల్.. సిబ్బందితో గొడవ.. అరెస్ట్