Hyderabad, July 12: తెలంగాణవాసులు (Telangana People) త్వరలో శుభవార్త వినబోయే అవకాశాలు ఉన్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ స్లీపర్ రైళ్లు (Vande Bharat Sleeper Train) త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. తొలి రైలును వచ్చే నెలలోనే ప్రారంభించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలును సిక్రింద్రాబాద్ - ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ నగరాల మధ్య వందేభారత్ రైళ్లు లేనందున తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలోనే నడపాలని కేంద్ర గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకు తాజాగా సూచించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్, రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.
వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వేగంగా ముందుకు కదులుతుంది.ఈ స్లీపర్ రైలును ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది.
Read more >>https://t.co/cH3OJtL765#vandebharattrain #RTV #LatestNews #VandeBharat
— RTV (@RTVnewsnetwork) July 12, 2024
మరో వందేభారత్ కూడా..
సికింద్రాబాద్ - పుణెల మధ్య ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది ఎక్స్ ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలు (చైర్ కార్) తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.