Big gift of Indian Railways, now passengers will get confirm seat in general coach(Photo-ANI)

New Delhi, March 30: ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకొని అగ్నిప్రమాదాలను నివారించేందుకు భారతీయ రైల్వే విభాగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో రాత్రిపూట ప్రయాణికులు చార్జింగ్‌ పాయింట్లను (Indian Railways Bar Charging) ఉపయోగించకుండా చేసేందుకు సిద్ధమైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో చార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ ఆఫ్ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది’ అని వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులు తమ మొబైల్స్, ల్యాప్‌టాప్స్ పగటిపూటనే ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు సహా ఇతరత్రా విద్యుత్తు పరికరాలకు (Electronic Devices on Board Trains) రాత్రిపూట చార్జింగ్‌ పెట్టే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదవశాత్తు వాటి వల్ల రైళ్లలో అగ్ని ప్రమాదాలు ( Precaution Against Fire) సంభవిస్తున్నాయి. దీంతో అన్ని రైల్వే జోన్లలో ఈ నిబంధనలను అమలు చేయాలని ఠాకూర్ యోచిస్తున్నారు. కాగా ఇటీవలే డెహ్రాడూన్‌కు చెందిన శతాబ్దిఎక్స్‌ప్రెస్‌లో మార్చి 13 న షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అంతేకాకుండా రాంచీ స్టేషన్‌లోని స్టాటిక్ గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి వివరించారు.

పాన్ కార్డు- ఆధార్ కార్డు లింక్, మార్చి 31లోగా చేయకుంటే పాన్‌ కార్డు చెల్లదు, అలాగే రూ.1000 జరిమానా, లింక్ చేయకుంటే ఎలా చేయాలో తెలుసుకోండి, లింక్ చేసి ఉంటే స్టేటస్ తెలుసుకోండి

భద్రతా చర్యల పై రైల్వే అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. రైళ్ల పరుగులో అన్ని భద్రతా చర్యలను క్షుణ్ణంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని రైల్వే మంత్రి పీయూష్ చావ్ల ఒక ప్రకటనలో తెలిపారు. రైళ్లలో అగ్ని ప్రమాదాలను తగ్గించడానికి ఇటీవల రైల్వే ధూమాపానంపై అనేక కార్యక్రమాలను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కారణం వల్లే ఆన్‌బోర్డ్ రైళ్ళలో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

అయితే అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి, తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి రైల్వే ఉన్నత అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతేకాకుండా వినియోగదారులు, సిబ్బందికి అవగాహన కల్పించడానికి ఏడు రోజుల ఇంటెన్సివ్ అవేర్‌నెస్ డ్రైవ్‌ను నిర్వహించాలని ఆదేశించారు.

ఇటీవల దేశంలోని 4,000 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ ప్రీపెయిడ్ ఇంటర్నెట్ అందిస్తున్నట్టు భారతీయ రైల్వేకు చెందిన రైల్‌టెల్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని మొత్తం 5,950 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం ఉంది. ఇందులో ప్రీపెయిడ్ వైఫై సదుపాయం 4000 స్టేషన్లలో లభిస్తుంది.