Hyderabad, Sep 5: తెలంగాణలో (Telangana) వర్షాలు (Rains) మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం పొద్దున నుంచి హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా.. మంగళవారం ఉదయానికి వర్ష తీవ్రత మరింత పెరిగిపోయింది. వానల కారణంగా విద్యార్థులకు పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు. ఇక మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
All schools, colleges, and educational institutions in Hyderabad will remain shut today, the collector of #Hyderabad announced#Education #India https://t.co/QWklHQTd2J
— News18.com (@news18dotcom) September 5, 2023
రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు: హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి.
ఆరెంజ్ అలర్ట్: జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, హనుమకొండ.
ఎల్లో అలర్ట్: అదిలాబాద్, కుమురం భీం, జోగులాంబ, గద్వాల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి.