
Hyderabad, May 30: వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి చల్లని కబురు చెప్పింది. ఉపరితల ద్రోణి కారణంగా జూన్ రెండో తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని పలుజిల్లాల్లో వర్షాలు (More rain forecast in Telangana) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు (Heavy Rains To Telangana) కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో వైపు కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వానలు పడ్డాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా బంట్వారంలో 53.3 మిలీమీటర్ల వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో శనివారం 36.0 నుంచి 44.6 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6 నుంచి 22.4 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా కుబీర్‌లో అత్యల్పంగా 22.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో శనివారం 36.0 నుంచి 44.6 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు (Daily Weather Forecast) నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6 నుంచి 22.4 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ వరకు సముద్ర మట్టానికి 1.5-2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరిత ద్రోణి ఆవరించి ఉండగా.. పశ్చిమ, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కిందస్థాయి గాలులు విస్తున్నాయి. వీటి ప్రభావంతో వచ్చే మూడురోజుల్లో రాష్ట్రంలో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నైరుతి రుతుపవనాలు ఈ సారి ముందే పలకరిస్తున్నాయి. గత వారమే దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు.. దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలో పలు ప్రాంతాల్లో ప్రవేశించిన రుతుపవనాలు ఒకరోజు ముందే కేరళ తీరాన్ని తాకనున్నాయి.
బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా ముందుకు వస్తుండగా ఈనెల 31న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రుతుపవనాల రాకతో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ నిపుణులు చెప్పారు. కాగా.. జూన్ 10 లోపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.