Newdelhi, July 30: విద్యార్థులపై (Students) బ్యాగుల (Bags) మోత తగ్గించడానికి, చదువును ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది. 6-8 తరగతులకు విద్యా సంవత్సరంలో 10 రోజులు బ్యాగ్ లెస్ డేస్ (Bagless Days) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌సీఈఆర్‌టీ అనుబంధ సంస్థ అయిన పీఎస్‌ఎస్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలను ప్రకటించింది.
బ్యాగ్ లెస్ డేస్ ఇలా..
బ్యాగులు లేని రోజుల్లో విద్యార్థులు ఖాళీగా ఉంటారని అనుకొంటే పొరపాటే. ఆ రోజుల్లో విద్యార్థులు గార్డెనింగ్, కుండల తయారీ, వంటలు, గాలిపటాల తయారీ, వాటి ఎగరవేత, పుస్తకాల ప్రదర్శన, కార్పెంటరీ, ఎలక్ట్రిక్ మెషీన్ రూపకల్పన ఇలా తమకిష్టమైన పనులు చేయవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఆయా రోజుల్లో స్కూల్స్ కు నిపుణులను రప్పిస్తారు.