Hyd, January 18: రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల విడుదలకు సంబంధించి తేది ఖరారైంది. ఈ పథకం ద్వారా రైతులకు డైరెక్ట్‌గా వారి బ్యాంకు ఖాతాల్లో ₹2,000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఏటా మూడు వాయిదాలలో మొత్తం ₹6,000 అందిస్తుంది. చివరగా గతేడాది అక్టోబర్‌లో రిలీజ్ చేశారు. ఇక ఈ ఏడాది 19వ వాయిదాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు.
()రైతులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి నివాసితులుగా ఉండాలి.
()5 ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్న రైతులు ఇందుకు అర్హులు
()సన్న, చిన్న రైతులు మాత్రమే అర్హులు.
()భర్త, భార్య మరియు వారి అవివాహిత పిల్లలపై ఆధారపడిన రైతు కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే PM యొక్క 19వ విడత పొందేందుకు అర్హులు.
కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు,నిపుణులు (రిజిస్టర్డ్ వైద్యులు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు న్యాయవాదులు, గత అసెస్‌మెంట్ సంవత్సరంలో పన్నులు చెల్లించిన పన్ను చెల్లింపుదారులు, నెలవారీ పెన్షన్ ₹10,000 లేదా అంతకంటే ఎక్కువ అందుకుంటున్న వారు, రాజ్యాంగ పదవులు కలిగిన రైతులకు ఈ పథకం వర్తించదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు, రెండు విడతలుగా సెషన్స్, ఆశగా ఎదురుచూస్తున్న ఆ రాష్ట్రాలు
అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/లోకి వెళ్లి లబ్దిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రం, జిల్లా, మండలం,గ్రామం వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది.
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే..ఆధార్ కార్డు,పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్,పాన్ కార్డ్ వివరాలు,ఓటరు ID కార్డు,కుటుంబ సమాచారం,బ్యాంక్ పాస్‌బుక్,
భూమి యాజమాన్య వివరాలు,సాగు భూమి వివరాలు,విద్యుత్ బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది.