Hyderabad, July 21: తెలంగాణలో (Telangana) భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలోని పెదవాగు పొంగిపొర్లుతుండటంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని మంత్రి తుమ్మలకు సూచించారు.
ఈ జిల్లాలకు అలర్ట్
హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ