Hyderabad, May 29: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు (Rains in Telangana) కురిసే అకాశాలున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ (Vidhrabha) నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు (North Tamilnadu) మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వానలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంటూ.. ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
నేటి ఉదయం
రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం ఉదయం వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
నేడు పొడి వాతావరణం
వచ్చే మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు, హైదరాబాద్ సమీప జిల్లాల్లో 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదవనున్నట్టు పేర్కొన్నది. సోమవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.