Hyderabad Rains (Photo-X)

Hyderabad, Sep 6: తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు (Rains) కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ (Hyderabad) వాతావరణ కేంద్రం  ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange Alert) జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 7వ తేదీ వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Article 370: ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై సుప్రీంకొర్టులో విచారణ పూర్తి, తీర్పు వాయిదా వేసిన అత్యున్నత ధర్మాసనం, రాతపూర్వక వాదనలకు మరో మూడు రోజుల సమయం

ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం

జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ స్పష్టంచేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భదాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది.

Hyderabad Rains: భారీ వర్షాలకు నాలాలో కొట్టుకుపోయిన నాలుగేళ్ల బాలుడు, తుర్క చెరువులో బాలుడి మృతదేహం లభ్యం, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు