Rains (Photo-Twitter)

Hyderabad, Nov 4: తెలంగాణలో (Telangana) వర్షాలపై (Rains) హైదరాబాద్‌ వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. ఈనెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వెల్లడించింది. బంగాళాఖాతం (Bay of Bengal) నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, అలాగే బంగాళాఖాతంపై ద్రోణి వరకు బలమైన తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగలు ఎండలు మండిపోతుండగా, రాత్రిళ్లు, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 16.7 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

IPL 2024 Auction: ఐపీఎల్‌-2024 వేలం తేదీ వచ్చేసింది, డిసెంబర్‌ 19న దుబాబ్‌ వేదికగా ఐపీఎల్‌ వేలం, ఈ సారి ఐపీఎల్‌పై భారీ పెట్టుబడి పెట్టనున్న సౌదీ

వర్షాలు ఎక్కడంటే?

నాగర్‌ కర్నూలు, వనపర్తి, జోగులాంబ-గద్వాల్‌, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సౌదీ అరేబియా, 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లుగా వార్తలు