Hyderabad, Sep 5: తెలుగు రాష్ట్రాలు (Telugu States) ఏపీ (AP), తెలంగాణలో (Telangana) వర్షాలు (Rains) దంచికొడుతున్నాయి. ఉపరితల అవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా తెలంగాణలో మరో ఐదు రోజులు, ఏపీలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వానలతో పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
ఈ జిల్లాల్లో వర్షాలు
నేడు జగిత్యాల, వికారాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీలో ఇలా..
కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో వాన బీభత్సం సృష్టించింది. నామనంక పల్లి దగ్గర వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.